ఆది సాయికుమార్ హీరోగా మహంకాళి మూవీస్ పతాకం పై ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి నూతన దర్శకుడు జి.బి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి “బ్లాక్” టైటిల్ చిత్రబృందం నిర్ణయించింది. అయితే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ తో పాటు మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే ఈ చిత్రాన్ని భారీ సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. దర్శకుడిగా తన మొదటి సినిమా అయినా కూడా జి.బి కృష్ణ టేకింగ్ చాలా వైవిధ్యంగా కనిపిస్తుంది , భవిష్యత్తులో తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప దర్శకుడిగా అవ్వడం ఖాయం అనిపిస్తోంది.

గత కొంత కాలంగా ఆది కి సరైన హిట్లు లేవు. ఈ చిత్రంలో ఆది పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఆది కెరీర్ లో ఇది ఒక గొప్ప మైలురాయిగా నిలవడం ఖాయమని,కచ్చితంగా ఈ సినిమా హిట్ కొడుతుందని చిత్ర బృందం గట్టి నమ్మకంతో ఉంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యిందని,మిగతా భాగం లాక్ డౌన్ ముగిసిన తరువాత పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్టు చిత్ర బృందం తెలిపింది.

ఈ చిత్రంలో దర్శనా బానిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు . ఈ చిత్రంలో బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌషల్ మండ పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం కౌషల్ నట జీవితంలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఆమని,వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శ్యామ్ కృష్ణ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.

మహంకాళి మూవీస్ పతాకం పై మహంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి డి .ఓ.పీ గా సతీష్ ముత్యాల, ఎడిటర్ గా అమర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ గా కె వి. రమణ పనిచేస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments