ఎన్టీయార్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ఫిజికల్ ట్రైనర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సిక్స్‌ప్యాక్ ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటో ఎన్టీయార్ అభిమానులనే కాకుండా సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో ఓ ట్వీట్ చేశాడు. ఎన్టీయార్ సిక్స్‌ప్యాక్ బాడీ ఫొటోను పోస్ట్ చేసి.. హే ఎన్టీయార్.. నేను గే ను కాననే సంగతి నీకు బాగా తెలుసు. అయితే ఈ ఫొటోలో నిన్ను చూసిన తర్వాత నేను గే అయితే బాగుండేది అనిపిస్తోంది. ఆ బాడీ ఎంట్రా నాయనా అంటూ వర్మ ట్వీట్ చేశాడు. పూరీ జగన్నాథ్ రూపొందించిన టెంపర్ సినిమాలో ఎన్టీయార్ సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మరోసారి సిక్స్‌ప్యాక్ సాధించాడు

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments