భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించేందుకు మోటార్ క్యాబ్ సంస్థ ఓలా సిద్ధమైంది. సుమారు 1,400 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు బుధవారం నాడు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ అన్నారు. తన జీవితంలో తీసుకున్న అతి కష్టమైన నిర్ణయం ఇదేనని ఆయన అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ ప్రకటించడంతో, సంస్థ ఆదాయానికి భారీగా గండి పడిందని అందుకే ఉద్యోగాల కోత నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. కరోనా వల్ల సంస్థ ఆదాయం 95 శాతం తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు.

లాక్‌డౌన్ ప్రకటించిన అనంతరం మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా దేశంలో అన్ని ప్రజా రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. క్యాబ్ సర్వీసులను కూడా ఇందులో పేర్కొనవచ్చు. ఓలాపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీన్ని పూడ్చుకునేందుకు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో కలసి కొత్త సర్వీసులను తీసుకొచ్చినా ఆదాయం మాత్రం పెద్దగా రాలేదు. అయితే ఆయా రాష్ట్రాల విధివిధానాలకు అనుగుణంగా అక్కడక్కడా సర్వీసులు ప్రారంభించినప్పటికీ మళ్లీ పాత రోజులు రావడానికి సమయం పడుతుందని అంటున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments