అన్ని జిల్లా కేంద్రాల్లో శ్రీవారి లడ్డూ విక్రయిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ.25 కే లడ్డూ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శ్రీవారి ఆశీస్సులు అందించాలన్న లక్ష్యంతో లడ్డూల విక్రయం చేస్తున్నట్లు ప్రకటించారు. టీటీడీ సమాచార కేంద్రాలు, కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక ఆర్డర్‌పై స్వామివారి లడ్డూలు పంపిణీ చేస్తామన్నారు. పెద్ద మొత్తంలో లడ్డూ ప్రసాదం కావాలంటే ఆర్డర్‌ చేయొచ్చని తెలిపారు. తమిళనాడు, కర్ణాటకలో కూడా లడ్డూ ప్రసాదం విక్రయిస్తామన్నారు. ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌- 9849575952 కి ఫోన్‌ చేయొచ్చని, ఆలయ పేష్కార్‌ శ్రీనివాస్‌- 9701092777 కి ఫోన్‌ చేయొచ్చని సుబ్బారెడ్డి తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here