మే 20న టాలీవుడ్‌కి చెందిన ముగ్గురు ప్రముఖుల ( ఎన్టీఆర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, మంచు మనోజ్‌) బర్త్‌డే కావడంతో వారికి అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల నుండి శుభాకాంక్షల వెల్లువ కురుస్తుంది. కరోనా వలన ఈ ముగ్గురు ప్రముఖులు ఈ ఏడాది బర్త్‌డే వేడుకలకి దూరంగా ఉంటున్నారు.

తాత నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏదైన సర్‌ప్రైజ్ ఈ రోజు వస్తుందని అభిమానులు భావించినప్పటికి, లాక్‌డౌన్ వలన అధి సాధ్యం కాలేదు. త్వరలో అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసేలా సర్‌ప్రైజ్ ఇస్తామని అంటుంది చిత్రబృందం. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం చేయనున్న విషయం తెలిసిందే.

ప్రేమగీతమైన, విరహరాగమైన, దేశభక్తి అయినా, విప్లవ గీతమైనా… సందర్భం ఏదైనా కావొచ్చు… కాలానికి తగ్గట్టు ఆయన రాసే పాటలు హృదయాలని స్పృశిస్తాయి. ఆయన రాసిన ప్రతి పాట ఆణిముత్యమే. తొలిపాటతోనే పేరు తెచ్చుకుని… తొలిసినిమానే ఇంటి పేరుగా మార్చుకున్నారు సిరి వెన్నెల. ఆయన ఇలాంటి బర్త్‌డే లని మరెన్నో జరుపుకోవాలని, తన పాటలతో మరింత కాలం అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మంచు మోహన్ బాబు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మంచు మనోజ్ హీరోగా తన కంటూ ప్రత్యేకమైన అభిమానులని ఏర్పరచుకున్నారు. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ వచ్చిన మనోజ్ తాజాగా అహం బ్రహ్మాస్మీ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here