నందమూరి నటవారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జూనియర్‌ ఎన్టీఆర్‌ … తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నారు. తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. బాలనటుడిగా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంలో భరతుడి పాత్రలో కనిపించిన ఎన్టీఆర్‌.. ఆ తర్వాత గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన బాలా రామాయణం చిత్రంలో తనదైన నటనతో అభిమానులను అలరించారు. 2001లో నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా పరిచమయ్యారు. ఆ తర్వాత స్టూడెంట్‌ నెంబర్‌ 1, ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, యమదొంగ, అదుర్స్‌, బృందావనం, టెంపర్‌, బాద్‌షా, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌, అరవింద సమేత వంటి హిట్‌ చిత్రాలతో అభిమానులను అలరించాడు. నటనలోనే కాకుండా డ్యాన్స్‌లో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు.

ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్నారు. మరోవైపు ఆయన బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 1కు హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్‌.. ఆ షో విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఒకవైపు హౌస్‌మేట్స్‌ను ఆటపట్టిస్తూ, మరోవైపు తన మాటలతో వారిలో ఉత్సాహం నింపుతూ ఎన్టీఆర్‌ షోను నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేడు ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ సీజన్‌ 1లో పాల్గొన్న పలువురు హౌస్‌మేట్స్‌ కూడా తారక్‌ను విషెస్‌ తెలిజేశారు. ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేక వీడియో ద్వారా తారక్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ వీడియోను మ్యూజిక్‌ డైరక్టర్‌ థమన్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

తారక్‌కు విషెస్‌ చెప్పినవారిలో బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌.. ఆదర్శ్‌ బాలకృష్ణ, అర్చన, దీక్షాపంథ్‌, హరితేజ, శివ బాలజీ, ధన్‌రాజ్‌, ప్రిన్స్‌, కత్తి మహేష్‌, సంపూర్ణేష్‌ బాబు, మధుప్రియ, కత్తి కార్తీక, జ్యోతి, కల్పన, ముమైత్‌ ఖాన్‌లు ఉన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments