ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే చాలు ఒక వాయిస్ గత రెండు నెలలుగా కంగారెత్తిస్తుంది. కరోనా మహమ్మారి పై అవగాహన కోసం మోత మోగుతున్న ఈ కాలర్ ట్యూన్ల వెనుక ఉన్న స్వరం ఎవరిదో వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఈ స్వరం ఎవరిదన్నది గోప్యంగా ఉంచినా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ వీడియో ద్వారా ఈ గొంతు ఎవరిది అన్న న్యూస్ బయటకు వచ్చేసింది. దక్షిణ కన్నడ జిల్లాకి చెందిన ఇద్దరు ఓయిస్ ఓవర్ ఆర్టిస్టులతో ఈ కాలర్ ట్యూన్లను రికార్డు చేశారు. దేశంలో కరోనా కలకలం మొదలైన మార్చి మొదటి వారంలో కాలర్ ట్యూన్లలో మొదట దగ్గు వినిపించి తర్వాత ఓ స్వరం వినిపించేది కదా అది దక్షిణ కన్నడ జిల్లాకి చెందిన జెస్సీకా ఫెర్నాండెజ్ తన వాయిస్ గా పెర్కొన్నారు.

ఢిల్లీ స్టూడియో నుంచి తనకు ఫోన్‌ వచ్చినప్పుడు.. త్వరలోనే తన స్వరం కాలర్‌ ట్యూన్‌గా వినిపించబోతుందన్న సంగతి అంతగా తెలియదన్నారు. కొద్ది రోజుల తర్వాత మా అమ్మ ఫోన్ చేసి నా స్వరం మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్‌గా వినిపిస్తున్నట్టు చెప్పారు. దీంతో వెంటనే ఢిల్లీ స్టూడియోకి ఫోన్ చేసి నా పేరు వెల్లడించవద్దని కోరాను. పదే పదే నా స్వరం వింటే వినియోగదారులకు విసుగెత్తి ట్రోల్ చేస్తారని ఇన్నాళ్లూ దాచిపెట్టాను అంది జెస్సికా. ఎవరో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేయడంతో నా పేరు బయటికి వచ్చింది. అయితే ఇప్పుడు ట్రోలింగ్స్‌తో పాటు నాకు ప్రశంసలు కూడా అంతే స్థాయిలో అందుతున్నాయది జెస్సీకా ఫెర్నాండెజ్. దగ్గుతో మొదలయ్యే కాలర్ ట్యూన్ జెస్సీకా స్వరం కాగా.. మిగతా రెండు ట్యూన్లకు విద్య నారాయణ్ భట్ డబ్బింగ్ చెప్పారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments