తాజాగా సింగర్ శ్రావణ భార్గవి ‘హలో లైవ్ లో మీలో’ అనే ఓ వీడియో ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియజేసింది. ఇంటర్వ్యూయర్ రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడగా… శ్రావణ భార్గవి చకచకా సమాధానాలు చెప్పి అందర్నీ ఫిదా చేసేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టైలిష్ గా ఉండేది ఎవరు అని ప్రశ్నించినప్పుడు… ఫిమేల్ అయితే సమంత ఆమె మేల్ అయితే విజయ్ దేవరకొండ అని టక్కున సమాధానం ఇచ్చింది ఈ గాన కోకిల.


మీరు యాక్టింగ్ రంగంలో అరంగేట్రం చేసి హీరోయిన్ గా నటించాలనుకుంటే మీ సరసన ఏ హీరో నటించాలని కోరుకుంటారు. హేమచంద్ర అని చెప్పకుండా వేరొక పేరు చెప్పండి అని ఆమెను అడగగా… నాకు విజయ్ దేవరకొండ అంటే చచ్చేంత ఇష్టం. తనతో నేను యాక్ట్ చేసేందుకు ఇష్టపడతాను. ఏ సింగర్ యాక్టర్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు అని ప్రశ్నించినప్పుడు… శైలజా గారిలో నటనా ప్రతిభ ఉంది. ఆమె సినీ రంగంలో అడుగు పెడితే బాగుంటుంది అని నేను భావిస్తున్నాను అని శ్రావణ భార్గవి చెప్పింది. ఇటీవల కాలంలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో చెప్పగలరా అని ప్రశ్నించినప్పుడు తాప్సీ నటించిన తప్పడ్ అని ఆమె చెప్పుకొచ్చింది.

హేమచంద్ర మీరు కలిసి ఒక డబుల్ డేట్ గా అంటే ఏ స్టార్ దంపతులతో కలసి హ్యాంగ్ ఔట్ చేయాలనుకుంటారు? అని ప్రశ్నించగా… అల్లు అర్జున్ స్నేహా రెడ్డి లతో కలిసి మా డబ్బులు డేట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఆమె చెప్పింది. నీకు ఇష్టమైన సింగర్ ఎవరు అని ప్రశ్నించగా ఆమె తెలుగులో చిత్ర, హిందీలో సునిధి చౌహాన్, ఇంగ్లీష్ లో బెయెన్సీ పేరు చెప్పింది. అయితే ఇంటర్వ్యూ కొనసాగుతున్న సమయం లో ఆమె నాలుగైదు పాటలు పాడి వీక్షకులని బాగా అలరించింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments