మహాత్మగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సినీనటుడు, జనసేన నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలను వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్ధించారు. అంతే కాకుండా నాగబాబు చెప్పింది వందశాతం నిజమని ఆయన అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో డిబేట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యఖ్యలు చేశారు.

”గాడ్సే కోరుకున్నవి రెండూ నెరవేరినా గాంధీని ఎందుకు చంపాడనేది ఎవరికీ తెలియదు. గాడ్సే లైఫ్‌లో ఎప్పుడూ గన్‌ పట్టుకోలేదు. ఆయనపై ఒక్క క్రిమినల్‌ కేసు కూడా లేదు. లాక్‌డౌన్‌ వల్ల నా వర్క్‌ ఏమీ ఆగిపోలేదు. నా ప్రతీ సినిమాలో శృంగారం అనేది ఉంటుంది. నాపై వచ్చిన రూమర్స్‌ అన్నీ నిజమే. మనం ఆయన్ని మర్చిపోకుండా దేవుడే కరోనా తెచ్చాడు” అని వర్మ అన్నారు. ఇకపోతే, త్వరలో గాడ్సే మీద ఒక సినిమా కూడా తీయబోతున్నానని రాంగోపాల్ వర్మ ప్రకటించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments