తెలంగాణ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన మంత్రివర్గం.. లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ చార్జీల పెంపుపై కూడా కేబినెట్ చర్చించింది. ఎంజీబీఎస్‌ను మరిన్ని రోజులు మూసి ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధివిధానాలపైనా చర్చించే అవకాశాలున్నాయి.
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ
Subscribe
Login
0 Comments