లాక్‌డౌన్‌ 4.0ను ఈ నెల 31 వరకూ పొడిగించిన నేపథ్యంలో.. సడలింపులపై అనేక సలహాలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలపై కూడా సలహాలు, సూచనలు వస్తున్నాయని చెప్పారు. అయితే లాక్‌డౌన్‌ సడలింపులపై సాయంత్రం జరగనున్న మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరి సలహాలు పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.

నేటి సాయంత్రం అయిదు గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వడంతో పాటు లాక్‌డౌన్‌ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధివిధానాలపైనా చర్చించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here