టాలివుడ్లో మంచి ఊపు మీద ఉన్న హీరోయిన్ రశ్మిక మందన్న. తెలుగులో నాగశౌర్య హీరోగా వచ్చిన చలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు తెలుగు అభిమానులు మంచి బ్రేక్ ఇచ్చారు. దీంతో ఎంగేజ్‌మెంట్‌ను కూడా రద్దు చేసుకుని సినిమాల్లో బాగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మహేష్ బాబు లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న రశ్మిక తన క్రేజ్‌ని రోజు రోజుకు పెంచుకుంటూ టాలివుడ్లో తన మార్కెట్‌ను పెంచుకుంటుంది. అయితే సినిమాల్లో సరదాగా కనిపించే రశ్మిక సోషల్‌మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది.
అంతే కాకుండా నిజ జీవితంలో కూడా తాను చాలా సరదా పనులు చేస్తానని ట్విట్టర్లో అభిమానులతో ఓ చిట్‌చాట్‌లో పేర్కొంది రశ్మిక. ఈ సందర్బంలోనే ఓ అభిమాని మీ జీవితంలో మరిచిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే చిన్నప్పుడు మామిడికాయల దొంగతనం చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది రశ్మిక. అప్పుడు ఓ మహిళ తనను కర్ర పట్టుకుని తరిమేదని కూడా చెప్పుకొచ్చింది. అలా తన అభిమానులతో తాను చిన్నప్పుడు చేసిన దొంగతనం గురించి చెప్పింది రశ్మిక.