హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ చిత్రం ఇటీవల 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్ పోస్ట్ చేసిన ట్వీట్‌లో బండ్ల గణేష్ పేరు ప్రస్తావించకపోండంతో హర్ట్ అయిన గణేష్ సోషల్ మీడియాలో హరీష్ శంకర్‌ని చులకన చేస్తూ పలు కామెంట్స్ చేశాడు. ఈ వివాదంలో ఇన్వాల్వ్ అయిన ప్రముఖ నిర్మాత పీవీపీ.. హరీష్ శంకర్‌ని సపోర్ట్ చేస్తూ సంచలన పోస్ట్ పెట్టాడు.

‘పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడ గురించి బ్రహ్మాండంగా చెప్పావు హరీష్‌. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వెయింటింగ్‌. తమ్ముడు స్టార్ట్‌ యూవర్‌ కుమ్ముడు’ అని పేర్కొన్నారు. పీవీపీ ట్వీట్‌పై స్పందించిన హరీష్‌.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ ‘భాష,భావం’ రెండూ నన్ను అలరించాయి. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి “ఫైటే” అక్కర్లేదు… “ట్వీటే” చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం’ అని పేర్కొన్నారు

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments