మహానటి సావిత్రి జీవితాన్ని ఎంతో అందంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. త్వరలో ఆయన ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అందులో భాగంగా నాగ్ అశ్విన్ ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం హిందీ స్టార్స్, తమిళం, మలయాళ స్టార్స్‌ని తీసుకొవాలని చూస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

కొద్ది రోజులుగా చిత్రంకి సంబంధించి జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో చిత్రం తెరకెక్కనుందని, ఇందులో సామాన్య మానవుడు, దేవకన్య మధ్య ప్రేమకు గుర్తుగా పుట్టిన ఓ పిల్లాడి కథ ఆధారంగా సినిమా రూపొందుతుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ చిత్రం కోసం భారీ విఎఫ్ఎక్స్ పనులు ఉండనుండగా, వీటి కోసం 50 కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాపై నెటిజన్ అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చి నాగ్ అశ్విన్ .. ప్రభాస్ సరసన నటించే హీరోయిన్‌ గానీ, లేదా ఇతర పాత్రలను ఇంకా ఫైనల్ చేయలేదని పేర్కొన్నాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments