కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతబడి దాదాపు రెండు నెలలు కావస్తుండగా, మరో మూడు నెలల పాటు థియేటర్లు తిరిగి తెరచుకునే అవకాశాలు లేవని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి సినిమా హాల్స్ పునఃప్రారంభంపై ప్రభుత్వం సానుకూలంగా లేదని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది నిబంధనలను విధిస్తూ హాల్స్ ఓపెన్ చేయించాలని అడుగుతున్నారని, మరికొందరు కొంతకాలం వేచి చూద్దామంటున్నారని ఆయన అన్నారు. షూటింగ్స్ కు కూడా అనుమతులు అడుగుతున్నారని, దీనిపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి వుందని తెలిపారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లోనే థియేటర్లు ప్రారంభిస్తే, వైరస్ సమస్య అధికమవుతుందని, ప్రేక్షకులు కూడా రాకపోవచ్చని తలసాని అంచనా వేశారు. భౌతిక దూరం పాటించేలా సినిమా హాల్స్ లోని సీటింగ్ ను మార్చాల్సి వుందని, నగరాలు, పట్టణాల్లోని మల్టీప్లెక్స్ ల విషయంలో సాధ్యమైనంత త్వరగానే ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని, జిల్లా స్థాయిలో సీటింగ్ ను తగ్గిస్తే, సినిమా హాల్స్ యజమానులు ఆర్థికంగా నష్టపోతారని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here