మహేష్ బాబు టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరు. మహేష్ లో మాస్ లుక్స్ కంటే కూడా క్యూట్ లవర్ బాయ్ లుక్స్ ఎక్కువగా ఉంటాయి. మాస్ హీరోగా మెప్పించిన పేస్ లో మాత్రం ఎక్కువగా ఇలాంటి క్యూట్ లుక్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మహేష్ బాబు తన కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పెద్ద కళ్ళజోడు, ఫుల్ షేవ్, లాంగ్ హెయిర్ తో చాలా క్యూట్ గా ఉన్నాడు. కొత్త సినిమా కోసం ఏమైనా ఇలా లుక్ మార్చాడా లేదంటే లాక్ డౌన్ లో న్యూ లుక్ కోసం ట్రై చేస్తున్నాడా అన్నది పక్కన పెడితే, ఈ లుక్ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు విపరీతమైన లైకులు, షేర్లు వస్తున్నాయి. లాక్ డౌన్ ముగిసిన వెంటనే మహేష్ బాబు…పరశురామ్ సినిమా ప్రారంభం అవుతుంది.