పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గోకులంలో సీత సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి రాశి తన చీరకట్టు అందం తో అందరి మనసులను దోచేసింది. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా నటించిన శుభాకాంక్షలు మూవీ లో తన అద్భుతమైన నటనా చాతుర్యం చూపించి గొప్ప నటీమణిగా తెలుగు ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది.

శ్రీరామచంద్రులు, చెప్పాలని ఉంది, దీవించండి, దేవుళ్ళు, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది లాంటి కుటుంబ కథా చిత్రాలలో నటించడంతో పాటు నాగ ప్రతిష్ట లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకుంది. శ్రీకాంత్, రాశి అప్పట్లో హిట్ పెయిర్ గా తెలుగు పరిశ్రమలో దూసుకెళ్లారు. మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో గోపీచంద్ సరసన నెగిటివ్ క్యారెక్టర్ లో చాలా సహజంగా నటించి తనలోని వేరొక కోణాన్ని చూపించి అందర్ని ఆశ్చర్యపరిచింది. హీరోయిన్ అవకాశాలు సన్నగిల్లిన తర్వాత కూడా ఆమె సినీ ఇండస్ట్రీకే అతుక్కుపోయి శృంగారభరితమైన పాటలలో నాట్యం చేసి కుర్రకారుని బాగా ఎంటర్టైన్ చేసింది.

‘ఒక పెళ్ళాం ముద్దు.. రెండో పెళ్ళాం వద్దు’ సినిమా షూటింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన ఎస్. శ్రీనివాస్ తో పరిచయం పెంచుకున్న రాశి తననే ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత సినిమాలకు క్రమ క్రమంగా దూరమై తన భర్తకు మంచి భార్యగా… పిల్లలకు మంచి తల్లిగా తన కుటుంబ జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నది. కేవలం రాశి మాత్రమే కాదు అప్పటి హీరోయిన్లంతా పెళ్లయిన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఏది ఏమైనా ఒక దశాబ్ద కాలం పాటు నటీమణి రాశి తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments