ఆర్ఆర్ఆర్.. మూవీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మూవీ సందడే. వచ్చే ఏడాది జనవరి 8 వతేదీ సంక్రాంతికి విడుదల అవుతుందని ముందు భావించినా విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ రిలీజ్‌ డేట్‌పై నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఆయన తేల్చేయడంతో ఈ సినిమా తర్వాత సినిమాలు చేయాలని భావిస్తున్న తారక్, ఛెర్రీలు ఆలోచనలో పడ్డారని అంటున్నారు.రాజమౌళి మూవీ అయ్యేవరకూ రామ్ చరణ్ ఇప్పటి వరకూ తన తర్వాత సినిమాకి కమిట్ అవ్వలేదు.. ఇప్పుడు మాత్రం డైరెక్టర్ వంశీపైడిపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగానే ఆర్ఆర్ఆర్ మూవీ ఆలస్యం అవుతోందనే వార్తలు వచ్చాయి అయితే ఈ లాక్‌ డౌన్ ఉండటం అనేది డైరెక్టర్స్ కి మంచి టైమ్ ఇచ్చింది. కథలో, కథనంలో మార్పులు తెచ్చుకోవడానికి, కొత్త కొత్త సినిమాలు చూడటానికి , స్క్రిప్ట్ ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఇచ్చింది. మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరున్న వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నా ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కన పెట్టేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్ కోసం ఒక కథని సిద్ధం చేసి చరణ్ డేట్స్ కూడా తీస్కున్నాడని చెబుతున్నారు. రాంచరణ్ తో వంశీకి మంచి అనుబంధం వుంది.

గతంలో రామ్ చరణ్ తో కలిసి ఎవడు సినిమా చేశాడు వంశీపైడిపల్లి. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా డైరెక్టర్ కి, హీరోకి మంచి పేరు తెచ్చిపెట్టింది. మ్యూజికల్ గా కూడా మంచి సక్సెస్ ని సాధించింది. వీరిద్దరూ కలిసి ఫుల్ యాక్షన్ మూవీనే చరణ్ కోసం ప్లాన్ చేశాడని, ఇప్పుడు ఆ టైం వచ్చిందంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా కాబట్టి రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. గతంలోలా కాకుండా రాంచరణ్ తర్వాత చిత్రాలన్నీ పాన్ ఇండియా తరహాలోనే వుండాలి. దీంతో వంశీపైడిపల్లి చరణ్ కాంబినేషన్ కి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి రామ్ చరణ్ ని వంశీ ఏ రేంజ్ లో చూపిస్తాడోనని మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments