క్రికెట్ పోటీలుంటే క్షణం తీరిక లేని ఆటగాళ్ళకు కరోనా వైరస్ లాక్ డౌన్ మంచి ఆటవిడుపుగా మారింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు, ఆసీస్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా వరుస వీడియోలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ‘పోకిరి’, ‘బాహుబలి’ చిత్రాల్లోని డైలాగులు చెబుతూ, ‘అలవైకుంఠపురములో..’లోని పాటలకు చిందులేస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు.డేవిడ్ వార్నర్ చాలాకాలంగా టిక్‌టాక్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌లాంటి వాటిలో ఎప్పటికప్పుడు తన వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నాడు. తాజాగా తెలుగు పాటకు తన భార్య క్యాండిస్‌తో కలిసి స్పెప్పులేసిన వీడియో వైరలైంది. ప్రముఖ తెలుగు సినిమా అలా వైకుంఠపురంలోని సూపర్‌హిట్ సాంగ్ బుట్టబొమ్మకు వార్నర్ దంపతులు డ్యాన్స్ చేశారు. ఆ వీడియోలకు అటు ఆయన అభిమానులు, ఇటు తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.తాజాగా ప్రభుదేవా పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్‌ చేశారు. శంకర్‌ దర్శకత్వంలో ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన చిత్రం ‘ప్రేమికుడు’. ఇందులోని ‘ముక్కాబులా’ పాట ఎంత ఫేమస్‌ అయిందో అందరికీ తెలిసిందే.

ఇటీవల దీన్ని రీమిక్స్‌ చేశారు. ఇప్పుడు ఆ పాటకు వార్నర్‌ తన భార్యతో కలిసి డ్యాన్స్‌ చేసి ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఎవరు బాగా చేశారంటూ ఇన్‌స్టాలో ఫ్యాన్స్ ని అడిగాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments