మెగా హీరోలు, తండ్రీ కొడుకులు చిరంజీవి, రాంచరణ్‌లు సోషల్‌మీడియా వేధికగా అభిమానుల లిస్టును పెంచుకోవడంలో పోటీ పడుతున్నారు. ట్విట్టర్‌లో దాదాపు ఇద్దరు హీరోలు ఒకేసారి అడుగుపెట్టారు. గత నెల 25న చిరంజీవి, 25 వ తేదీన రాంచరణ్‌లు తమ ట్విట్టర్‌ ఖాతాలను తెరిచారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరూ ట్విట్టర్‌ వేధికగా అభిమానులకు అందుబాటులో ఉంటూ తమకు సంబందించిన సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే చాలా వేగంగానే ఈ ఇద్దరూ తమ ట్విట్టర్‌ అనుచరుల సంఖ్య 5 లక్షల మార్క్‌ను అందుకున్నారు. అయితే వీరిద్దరి మద్య అభిమానుల వ్యత్యాసం కూడా చాలా తక్కువే ఉంది. కానీ ఇంకోలా చూస్తే చిరు ఏకంగా 112 ట్వీట్లు చేయగా రాంచరణ్‌ కేవలం 18 ట్వీట్లు మాత్రమే చేశారు. తక్కవ ట్వీట్లు చేసినా తండ్రితో సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు రాంచరణ్‌.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments