సినిమా షూటింగులతో బిజీగా ఉండే మహేష్ బాబు లాక్‌డౌన్ వలన ఇంటికే పరిమితమయ్యారు. ఇద్దరు పిల్లలతో లాక్‌డౌన్ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. ముఖ్యంగా సితారతో కలిసి మహేష్ చేసే హంగామా ఫ్యాన్స్‌కి అమితానందాన్ని కలిగిస్తుంది. తాజాగా నమత్ర తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మహేష్‌, సితారల సందడికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఇది వైరల్‌గా మారింది.

మహేష్ పాట పాడుతూ క్యూట్ టెడ్డీబేర్‌తో సితారని తెగ నవ్విస్తున్నాడు. సితార ఆనందాన్ని చూసి మహేష్ తెగ మురిసిపోతున్నాడు. వీరిద్దరి సరదా ఆటపటలని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. లాక్‌డౌన్ పూర్తైన తర్వాత మహేష్ బాబు..పరశురాం దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments