హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో కూడిన ఈ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. పలుచోట్ల ఈ గాలులకి చెట్లు పడిపోయాయి. భీకరంగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి.దాంతో ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్‌లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, ఎస్సార్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, కార్వాన్‌, తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఖైరతాబాద్‌లో 3సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షం కురిసిన చోట లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. పలు ప్రాంతాల్లో వడగళ్ళు కూడా పడ్డాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments