చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉండేది. కాని ఇప్పుడు తెలుగు సినిమాలలో నటించడం పూర్తిగా మానేసింది. చాలా రోజుల తర్వాత త్రిషకి చిరంజీవి తాజా చిత్రం ఆచార్యలో నటించే గోల్డెన్ ఛాన్స్ వచ్చినప్పటికీ, సున్నితంగా తిరస్కరించింది. అందుకు కారణం ఆమె వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలన ఈ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. అయితే ఆచార్య మిస్ అయిన మరో సినిమాలో చిరు సరసన నటించే అవకాశం త్రిషకి దక్కిందని టాక్.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ లూసిఫర్ రీమేక్‌ని నిర్మిస్తానని ఇప్పటికే అఫీషియల్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా త్రిషని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ ఛాన్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవొద్దని త్రిష కూడా అనుకుంటుందట. చూడాలి చిరు- త్రిష కాంబినేషన్ ఫిక్స్ అవుతుందా లేదా అనేది రానున్న రోజులలో తేలనుంది

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments