టాలీవుడ్ మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్ రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవలే తన ప్రేయసిని పరిచయం చేసాడు రానా. ఇప్పుడు రానా ప్రేమ మ్యాటర్ హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే పలువురు రానాకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా రానా పెళ్లి పై ఆయన తండ్రి సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘ఇటువంటి కష్ట సమయంలోనూ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మాకు కారణం లభించింది. మొత్తం కుటుంబం చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం నుంచి రానా, మిహీకకు పరిచయం ఉంది. వారి పట్ల మేం చాలా ఆనందంగా ఉన్నాం. ఈ ఏడాదిలోనే రానా వివాహం జరగబోతోంది. డిసెంబరులో పెళ్లి నిర్వహించాలని అనుకుంటున్నాం. కానీ దాని కన్నా ముందే వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి.’అని అన్నారు. ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లపై ప్లాన్ చేసుకుంటున్నామని త్వరలోనే వెల్లడిస్తామని సురేష్ బాబు తెలిపారు.
రానా పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు..!
Subscribe
Login
0 Comments