ఇప్పుడు ప్రపంచం కరోనా ముందు తర్వాత అని మనం విస్లేశించుకునే పరిస్థితి వచ్చింది అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం నమ్ముతుందని మోడీ పేర్కొన్నారు. భారత ఔషధాలు ప్రపంచానికి వరంగా మారాయని మోడీ పేర్కొన్నారు. ఓటమిని ఎప్పుడూ కూడా ఒప్పుకోవద్దు అని మోడీ పిలుపునిచ్చారు.

భారత అభివృద్ధి పయనం మళ్ళీ మొదలైందని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేసారు. సంక్షోభం లో ఉన్నా సరే మనం ఎక్కడా కూడా భయపడకుండా ముందుకు సాగాలి అని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మోడీ హామీ ఇచ్చారు. మధ్య తరగతి ప్రజలను కేంద్రం ఆదుకుంటుంది అని మోడీ వివరించారు. ఆత్మ బలం చాలా కీలకమని పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments