భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనావైరస్ మహమ్మారికి సంబంధించి ఐదోసారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రి 8 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. మోదీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు రాత్రి 8 గంటలకు ఈ పేజీలో చూడవచ్చు.
మార్చి 24 నుంచి అమల్లో ఉన్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది.
రెండోసారి విధించిన లాక్ డౌన్ వాస్తవానికి మే 3తో ముగియాల్సి ఉండగా, మరో రెండువారాల పాటు పొడిగిస్తూ మే 1న హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
మే 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 10కి పైగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇప్పటికే మే 12 నుంచి రైలు ప్రయాణాలకు కేంద్రం అనుమతించింది. మే 15 లోపు దేశీయ విమానాలను ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో మోదీ లాక్ డౌన్‌ను మరోసారి పొడిగిస్తారా లేక, లాక్ డౌన్ ఎత్తివేసేందుకు అవసరమైన ప్రణాళికలను వెల్లడిస్తారా అనేది వేచి చూడాలి.