లాక్ డౌన్ ఎగ్జిట్ 2.0 లో భాగంగా కేంద్రం కొన్ని సడలింపులు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో భాగంగానే వలస కూలీలను కూడా తరలించే ఏర్పాట్లు కేంద్రం చేస్తోంది. మరోవైపు అన్ని రాష్ట్రాలు వలసకూలీలను అనుమతించడానికి సరిహద్దులు తెరుస్తున్నాయి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. జైనథ్ మండలం డొలారా వద్ద ప్రత్యేక చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసారు. ఆదిలాబాద్ సరిహద్దు మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న వాహనాలు, వ్యక్తులను ఈ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తారు. ఈ తనిఖీల నిమిత్తం వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్, శాఖల  సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తనిఖీ పూర్తి అయినా తరువాతే వాహనాలను.. వ్యక్తులను రాష్ట్రము లోకి అనుమతిస్తారు. 
                   అలానే తెలంగాణ లోకి వచ్చే సొంత రాష్ట్రము వారిని కూడా పదునాలుగు రోజుల క్వారంటైన్ ముద్రను వేసి పంపుతున్నారు. వారిని పదునాలుగు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సింది గా సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారిని పాస్ లతో అనుమతిస్తున్నారు. ఈ ప్రత్యేక చెక్ పోస్ట్ ను కలెక్టర్  శ్రీదేవసేన సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments