ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణంగా సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం సినీ సెలబ్రిటీల అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు తమ ఫిట్నెస్పై దృష్టి పెడుతూ ఆరోగ్యాన్ని పెంచుకుని రోగ నిరోధకశక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులందరూ లాక్‌డౌన్‌ సమయంలో ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుని అలరిస్తూనే ఉన్నారు. కేవలం యువ హీరోలు నటులే కాదు సీనియర్ నటులు కూడా ప్రస్తుతం ఎక్కువగా ఫిట్నెస్ పైనే దృష్టి పెట్టారు. తాజాగా విలక్షణ నటుడు నరేష్ కూడా ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన వీడియో ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా… తనదైన నటనలో ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి నటిస్తూ పాత్రకు ప్రాణం పోసిన నటుడు నరేష్. కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్గా ఇలా ఎన్నో పాత్రల్లో నటిస్తూ తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు నరేష్. అయితే తాజాగా తన ఫిట్నెస్ వీడియో కు సంబంధించి ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సందర్భంగా తాను వ్యాయామం చేస్తున్న ఒక వీడియో ని పోస్ట్ చేస్తూ… స్నేహితులందరికీ శుభోదయం… మళ్లీ బరువు తగ్గేందుకు శిక్షణ తీసుకుంటున్నాను.. లుక్స్ బాగా కనిపించడానికి కాదు కేవలం ఫిట్ గా ఉండటానికి మాత్రమే… కార్డియో ఒక్కటి మాత్రమే మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచలేదు… రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ తండ్రి పాత్ర పోషించినప్పుడు తను దర్జీ పాత్రను పోషించాల్సి వచ్చింది. ఆ సమయంలో తాను బరువు తగ్గే ట్రైనింగ్ ని వదిలి పెట్టినట్లు చెప్పుకొచ్చిన నరేష్ ప్రస్తుతం మళ్లీ శిక్షనను ప్రారంభించినట్లు చెప్పాడు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments