‘కిల్‌ ఫేక్‌ న్యూస్‌’ అంటూ పిలుపునిచ్చిన టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ కు మెగాస్టార్‌ చిరంజీవి మద్దతుగా నిలిచాడు. కరోనాపై పోరాటంలో భాగంగా తాను చేస్తున్న సహాయ కార్యక్రమాలపై విషప్రచారం చేస్తున్న పలు వెబ్‌సైట్లపై విజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనపై తప్పుడు వార్తలు రాసిన వెబ్‌సైట్లను కడిగిపడేస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. ఇక ఈ విషయంలో విజయ్‌కు మద్దతుగా మహేశ్‌బాబు, క్రిష్‌, కొరటాల శివ, అనిల్‌ రావిపూడి తదితరులు ట్వీట్లు చేశారు.

తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా విజయ్‌కు సంఘీభావం తెలుపుతు ట్వీట్‌ చేశారు. ‘డియర్‌ విజయ్‌ మీ ఆవేదన అర్థం చేసుకోగలను. బాధ్యతలేని రాతల వల్ల మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము మీతో ఉన్నాం. ఏది ఏమైనా మంచి చేయాలనే నీ స్పూర్థిని కొనసాగించు. అదేవిధంగా జర్నలిస్టు సోదరులకు చిన్న విజ్ఞప్తి. మీ సొంత అభిప్రాయాలను వార్తలుగా ప్రచురించవద్దు’ అంటూ చిరు ట్వీట్‌ చేశారు.

‘హాయ్‌ విజయ్.. నేను నీకు మద్దతు తెలుపుతున్నాను. ఇటువంటి వెబ్‌సైట్లపై స్పందించడంలో ఇప్పటికే సినీ పరిశ్రమ చాలా ఆలస్యం చేసింది. సినీ పరిశ్రమ నుంచి వారు జలగల్లా రక్తం పీల్చుకుని తాగుతున్నారు. అలాంటి ఫేక్ న్యూస్ రాసే వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ చిరంజీవి సోదరుడు నాగబాబు ట్వీట్‌ చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments