దర్శకధీరుడు రాజమౌళి త్వరలో రామాయణ కథను తెరకెక్కించబోతున్నారని గత కొద్దీ రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్ ‘సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమరం భీం గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక త్వరలో రాజమౌళి రామాయణం కథను తెరకెక్కిస్తారన్న వార్తలపై జక్కన స్పందించారు. రామాయణం తెరకెక్కించాలని తాను ఎప్పటినుంచో అనుకుంటున్నానని రాజమౌళి తెలిపారు.ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ .. ‘ నిజంగానే మహాభారతం సినిమా తీయాలనేది నా కల. ఎప్పటికైనా తెరకెక్కించి తీరాలి. దానికి సంబంధించి పనులు మొదలు పెట్టాలి.’ అని వివరించారు. ఇప్పటికిప్పుడు కూర్చొని పని చేసే ప్రాజెక్ట్ కాదది. చాలా శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి. పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టాలి. అప్పుడు కానీ దాన్ని మొదలు పెట్టలేమని చెప్పుకొచ్చారు రాజమౌళి.
‘రామాయణం’ పై రాజమౌళి ఏమన్నారంటే.
Subscribe
Login
0 Comments