సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ అందుకొని మంచి జోష్ లో ఉన్నారు మహేష్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు రామ్ చరణ్. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారని ఫిలిం నగర్ వర్గాలలో టాక్. వీరిద్దరూ కలిసి నటిస్తున్నారనుకుంటే మీరు పొరబడినట్టే. ఇప్పటికే ఖైదీ నెం 150,సైరా నరసింహారెడ్డి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తానేంటో నిరూపించుకున్న రామ్ చరణ్ మహేష్ బాబు కథానాయకుడిగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక సినిమా నిర్మించనున్నారట. .

మహేష్ బాబు తన తదుపరి సినిమా సుకుమార్ తో చేయాలనుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. అయితే ఇప్పటికే డైరెక్టర్ పరశురామ్ మహేష్ కు కధ వినిపించగా ఆ కధకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట . అయితే పరశురాం మహేష్ చేయబోయే సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నట్టుగా ఫిలిం నగర్ వర్గాలలో అనుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ ఇద్దరి హీరోల అభిమానులకు పండగే. అయితే ఈ వార్తలలో ఎంతవరకూ నిజం ఉందనేది అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఎదురు చూడాల్సిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments