మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు చరణ్. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నెం 150 సినిమాకు , ఆ తర్వాత వచ్చిన సైరా సినిమాకు చరణ్ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కొణిదల ప్రొడక్షన్స్ పేరుతో చరణ్ నిర్మాణ సంస్థను స్థాపించారు. డిజిటల్ యుగంలో వెబ్ సిరీస్‌లకి ఉన్న ఆదరణ అంతకంత పెరుగుతూ పోతుంది. స్టార్ డైరెక్టర్స్ పలు వెబ్ సిరీస్‌లు చేస్తుండగా, అందులో స్టార్ నటీనటులు కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఓ వెబ్ సిరీస్ తీయాలని చూస్తున్నాడట. ఈ వెబ్ సిరీస్ కు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ రంగస్థలం సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే . ఈ వెబ్ సిరీస్‌ని అమెజాన్ ప్రైంలో టెలికాస్ట్ చేయాలనుకుంటుండగా, అమెజాన్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్ చరణ్ బంధువుతో చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
రాంచరణ్ నిర్మాతగా సుకుమార్ వెబ్ సిరీస్ ..?
Subscribe
Login
0 Comments