కరోనా మహమ్మారి నియంత్రణకు ఆయా ప్రభుత్వ యంత్రాంగాలు కఠినంగా వ్యవహరించాలని బీజేపీ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల నివేదికల ఆధారంగానే జోన్లను ఎంపిక చేసినట్టు తెలిపారు. అయితే ఆయా రాష్ట్రాల కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్ల విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సూచించారు.
ఈ కంటైన్మెంట్ జోన్లలో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలౌతుందని తెలిపారు. వలస కార్మికులను కచ్చితంగా తమ ప్రాంతాలకు చేరుస్తామని అన్నారు. వలస కార్మికుల తరలింపునకు బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందు కోసం 300 రేళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వలస కార్మికులను తీసుకొని తొలి రైలు హైదరాబాద్ నుంచి జార్ఖండ్ లోని రాంచీకి వెళ్లిందని తెలిపారు.