కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకీ కరోనా రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీనిని అరికట్టడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. భారత ప్రభుత్వం కరోనాను అడ్డుకోడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. రెండొవ దశ లాక్ డౌన్ మే 3 న ముగియనుండడంతో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్న విషయం పై అందరూ చర్చించుకుంటున్నారు. అయితే కొద్దీ సేపటి క్రితం కేంద్ర హోంశాఖ నుండి లొక్డౌన్ పొడిగింపుపై అధికారిక ప్రకటన వెలువడింది.
మే 3 నుండి రెండు వారాలు అంటే మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగనుందని హోమ్ శాఖ ప్రకటించింది. అయితే కేసులను పరిగణలోకి తీసుకొని రెడ్,ఆరెంజ్,గ్రీన్ జోన్లుగా విభజించి గ్రీన్,ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ఉంటాయని ఈ ప్రకటనలో తెలిపారు. గ్రీన్ జోన్లలో ఉదయం అన్ని కార్యకలాపాలు యదావిధిగా కొనసాగుతాయి,రాత్రి 7 నుండి ఉదయం 7 వరకు ఎప్పటిలాగే కర్ఫ్యూ కొనసాగుతుంది. రెడ్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ మరింత కఠినతరం చేసి ప్రతీ వారం పరిస్థితిని పరిశీలించి కేసులు తగ్గితే గ్రీన్ జోన్లగా మార్చే అవకాశం ఉందని ఈ ప్రకటనలో తెలిపారు.