ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీకపూర్‌ (67) కన్నుమూశారు. ఆరోగ్యం విషమించడంతో ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు.

బాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం నాడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందగా, మరుసటి రోజే రిషీకపూర్ వార్త రావడంతో బాలీవుడ్ ను శోకసంద్రంలో ముంచింది. ఆయన మృతికి అమితాబ్ బచ్చన్, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంతాపం తెలిపారు.

బాలీవుడ్ ప్రముఖ నటుడు దివంగత రాజ్ కపూర్ కుమారుడే రిషికపూర్. బాల నటుడిగా శ్రీ 420 చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. ఎన్నో ప్రముఖ చిత్రాలలో నటించారు. మేరా నామ్ జోకర్, బాబీ, లైలా మజ్నూ, రఫూ చక్కర్, సర్గమ్, ఖర్జ్, ప్రేమ్ రోగ్, నగీనా, హనీమూన్, చాందినీ, హీనా, బోల్ రాధా బోల్ వంటి చిత్రాలలో నటించి ఆశేష ప్రేక్షకులను సంపాదించుకున్నారు. భార్య నీతూ సింగ్, కుమార్తె రిథిమా కపూర్, కుమారుడు రణబీర్ కపూర్ ఉన్నారు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. 2018లో న్యూయార్క్ వెళ్లి క్యాన్సర్ కు చికిత్స చేయించుకుని వచ్చారు. ఏప్రిల్ 29 బుధవారం రాత్రి ముంబై హెచ్ఎస్ రిలయన్స్ హాస్పిటల్ లో చేరి మరుసటి రోజే అనగా ఈరోజు కరోనా వైరస్ బారిన పడి తుది శ్వాస విడిచారు. విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నా ఫలితం దక్కలేదు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments