ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ మరణం సినిమా, నాటక రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన మరణం భారతీయ సినిమాకే కాకుండా ప్రపంచ సినీ రంగానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. ఇర్ఫాన్ తన నటనతో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారని అన్నారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పెద్దపేగు సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన మరణించారు. చిన్న వయసులోనే బాలీవుడ్ విలక్షణ నటుడు మరణించడం బాధాకరమని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇర్ఫాన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
ప్రపంచ సినిమాకు తీరని లోటు..
Subscribe
Login
0 Comments