రాబోయే రోజుల్లో కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుందన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రజల సహకారంతో కరోనాను తరిమికొడదామని స్పష్టం చేశారు. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని గుర్తుచేశారు. కరోనాను అరికట్టగలమనే పూర్తి విశ్వాసం తనకుందని అన్నారు. అది ప్రజల సహకారంతో సాధిస్తామన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించాలన్నారు. అలాగే లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. భారత దేశంలో కొత్త ప్రాంతాలకు కరోనా విస్తరించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments