మలయాళీ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఛాలెంజ్‌ విసిరారు. ఇంటి పనుల్లో శ్రీమతికి సాయం చేసి వీడియోను పోస్ట్‌ చేయమని దేవిశ్రీ కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు ప్రస్తుతం ‘బి ది రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌లో భాగమవుతున్నారు. ఛాలెంజ్‌లో భాగంగా ఇంట్లో ఉన్న మహిళలకు అన్ని పనుల్లో సాయం చేసి రియల్‌ మ్యాన్‌ అనిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల దర్శకుడు సుకుమార్‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన దేవిశ్రీ తాజాగా ఓ వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఇంటి పనుల్లో తన తల్లికి సాయం చేసి, ఆమెకు వంట చేసి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌ ఖాతా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘సుక్కు బాయ్‌ నా ఛాలెంజ్‌ వీడియో ఇదిగో. సందీప్‌రెడ్డి వంగా, రాజమౌళి, చిరంజీవి వీడియోలను చూశాక నేను కూడా ఇందులో భాగమయ్యాను. అల్లు అర్జున్‌, కార్తి, యశ్‌, హరీశ్‌ శంకర్‌ అలాగే మోహన్‌లాల్‌ సర్‌ను ఈ ఛాలెంజ్‌ కోసం నామినేట్‌ చేస్తున్నా’ అని దేవిశ్రీ పేర్కొన్నారు.

ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దేవిశ్రీ స్వరాలు అందించారు. త్వరలో విడుదల కానున్న ‘ఉప్పెన’ చిత్రానికి దేవిశ్రీ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా ఏప్రిల్‌ ఆరంభంలో విడుదల కావాల్సి ఉండగా కరోనావైరస్‌ వల్ల కొంతకాలంపాటు ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. అలాగే అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘పుష్ప’ సినిమాకి కూడా ఆయనే స్వరాలు అందిస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments