చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. ముందుగా ఈ సినిమాలో కథానాయికగా ‘త్రిష’ను తీసుకున్నారు. అయితే తన పాత్రకి ప్రాధాన్యతలేని కారణంగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో ఆమె స్థానంలో కాజల్ ను తీసుకున్నట్టుగా చెప్పారు. ఆ విషయాన్ని కాజల్ ధ్రువీకరించింది కూడా.

తదుపరి షెడ్యూల్లో ఆమె జాయిన్ అవుతుందని అన్నారు. కానీ ఆమె కూడా ఈ ప్రాజెకు నుంచి తప్పుకుందనే టాక్ వినిపిస్తోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ జోడీగా చేయడానికి ఆమె అంగీకరించిందట. ఇందుకుగాను ఆమె బల్క్ గా డేట్స్ ఇచ్చిందనీ, భారీ పారితోషికమే అందుకుందని అంటున్నారు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే తను ‘ఆచార్య’ చేయలేకపోతున్నట్టు చెప్పిందట. అయితే, ఇందులో తన పాత్రకి ఏ మాత్రం ప్రాధాన్యత లేని కారణంగానే ఆమె తప్పుకుందనే టాక్ కూడా వినిపిస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments