ఇటీవలే సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి.. చాలా యాక్టివ్‌గా పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులపై స్పందించడమే కాకుండా, తన జ్ఞాపకాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల కాలంలో తాను ఓ పాటును బాగా ఎంజాయ్‌ చేస్తున్నానని నిన్న ట్విటర్‌లో పేర్కొన్న చిరు.. నేడు ఆ వివరాలు వెల్లడించారు.  ఖైదీ నంబర్‌ 150 చిత్రంలోని ‘మిమ్మీ మిమ్మీమి.. ఇకపై ఓన్లీ యూ అండ్ మీ’ పాట తను చాలా సార్లు విన్నానని తెలిపారు. ఈ పాటను పిల్లలు కూడా చాలా ఇష్టపడతున్నారని చెప్పిన చిరు.. ఆ పాటను తన మనవరాలు నవిష్క(శ్రీజ చిన్న కుమార్తె) ఎంతగా ఇష్టపడుతుందో తెలిపే వీడియోను షేర్‌ చేశారు. ఆ పాట చూస్తున్నప్పుడు నవిష్కతో కలిసి చిరు ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. అయితే పాటను మధ్యలో పాస్‌ చేయడంతో నవిష్క ఎడ్చేసింది. దీంతో చిరు ఏం కావాలని అడిగారు.. దానికి నవిష్క మిమ్మీ చెప్పింది.

‘నేను మ్యూజిక్‌కు ఉన్న శక్తి గురించి ఎప్పుడూ ఆశ్చర్యపోతాను. ఈ పాటకు కేవలం ఏడాది చిన్నారి ఎలా ఎంజాయ్‌ చేస్తుందో చూడండి. డ్యాన్స్‌ చేయడానికి ప్రయత్నించడమే కాకుండా ఎంతో ఆనందాన్ని పొందుతుంది. పాటను మధ్యలో ఆపి, మళ్లీ ప్లే చేస్తూ.. తనకు ఆ పాట నిజంగా ఇష్టపడుతుందా అని చూశాను. ఈ పాట నాది కాబట్టి, అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్‌ నాకే’ అని చిరు పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments