ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 56కు చేరుకుంది. నిన్న జిల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒంగోలు ఇస్లాంపేటలో ఒకరికి, గుడ్లూరులో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 8453 శ్యాంపిళ్లు పంపగా 4583 మందికి నెగిటివ్‌గా తేలింది. అలాగే ఇంకా 3813 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లలో 410 ఉన్నారు. జిల్లాలో వీఆర్డీఎల్, క్లియా ల్యాబ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు కరోనా భారి నుండి కోలుకుని 23 మంది డిశ్చార్జ్ అవగా, ప్రస్తుతం 33 మంది చికిత్స పొందుతున్నారు.
ప్రకాశం జిల్లాలో 56కు చేరుకున్న కరోనా కేసులు
Subscribe
Login
0 Comments