ఆంధ్రా యూనివర్సిటీ.. తెలుగు నేలకే కాదు.. ఈ దేశానికి.. ఈ ప్రపంచానికి ఎందరో మేధావులను అందించింది. విద్యావ్యవస్థలో అద్భుతమైన విజయాలను అందుకుంటి. ఇంతటి ఘన చరిత్రగలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం 95వ ఆవిర్భావ దినోత్సవాన్నిజరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం గొప్పదనంపై ట్వీట్ చేశారు. *ఆంధ్ర విశ్వవిద్యాలయం 95 వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నది.. ఈ గొప్ప సంస్థతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను. నాణ్యమైన విద్యను అందించే గొప్ప సంప్రదాయాన్ని విశ్వవిద్యాలయం కొనసాగిస్తుందని, దేశానికి గొప్ప వ్యక్తులను అందిస్తుందని నాకు నమ్మకం ఉంది* అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. విశ్వవిద్యాలయంలో నాటి పరిస్థితులను వివరిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం గొప్పదనం గురించి చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో మరికొందరు మాత్రం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డికి కోరుతున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments