బుల్లితెర నుంచి వెండితెరకి వచ్చి తన ప్రతిభను నిరూపించుకున్న నటులలో హర్షవర్ధన్ ఒకరు. నటుడిగానే కాదు రచయితగాను ఆయనకి మంచి పేరు వుంది. తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అంతకుముందు ప్రసారమైన సీనియర్ హీరోయిన్ ‘యమున’ ఎపిసోడ్ ను గురించి ప్రస్తావించాడు.

“ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలు అనేవి ఇంటరాగేషన్ మాదిరిగా తయారయ్యాయి. ఒక రకమైన ఎక్స్ ప్రెషన్ తో అడిగే ప్రశ్నలు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి ధోరణికి మీ ఇంటర్వ్యూలు దూరంగా ఉంటాయి. కానీ అలాంటి మీరు ‘యమున’ ఎపిసోడ్ కి ఇచ్చిన ‘ఇంట్రో’ చూసి షాక్ అయ్యాను. ‘ఇప్పుడు కూడా మేకప్ అవసరమా .. తీసొస్తే బెటర్ గదా .. ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం’ అంటూ మీరు మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఒక ఎఫెక్ట్ కోసం మీరు అలా చేసి వుంటారు .. కానీ ‘ఇలాంటివి అవసరమా?’ అనిపించింది. అందుకే వెంటనే ఆ రోజున మీకు కాల్ చేసి, ఈ విషయాన్ని గురించి మాట్లాడాను. తనపై పడిన అపవాదు విషయంలో క్లారిటీ ఇచ్చే విషయంలో ఆమె పడిన వేదన నాకు చాలా బాధను కలిగించింది” అని హర్షవర్ధన్ చెప్పుకొచ్చాడు. అయితే కొత్తదనం కోసం .. ముందుగా యమునతో మాట్లాడే అలాంటి ‘ఇంట్రో’ను ప్లాన్ చేయడం జరిగిందని టీఎన్నార్ సమాధానమిచ్చారు. 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments