సామాన్యంగా ఎర్రచందనం చెట్లను కొట్టి స్మగ్లింగ్ చేసేవారిని అడవిదొంగ అంటాం. చాలా మంది అమాయకులను తమ కూలీలుగా మార్చి వారి ద్వారా స్మగ్లింగ్ చేస్తుంటారు. అయితే కూలీలుగా వచ్చి బలైపోతున్న ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ఉద్దేశించి తెరకెక్కుతున్న చిత్రం “అడవి దొంగ “. కిరణ్ కోటప్రోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా పర్ణిక ఆర్ట్స్ పతాకం పై గోపి కృష్ణ శేషం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన నటుడు రామ్ తేజ్, రేఖ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదలయ్యింది. ఈ మోషన్ పోస్టర్ ను చూస్తే ఎర్రచందనం చెట్లను కొట్టే కూలీలు ఎంత దయనీయంగా, నిస్సహాయస్థితిలో ఉంటారనేది అర్ధమవుతోంది, కూలీలు బానిసలుగా ఉండలేక తిరగబడి తమ జీవితాలను ఎలా నిలబెట్టుకున్నారనేది ముఖ్య కధాంశంగా తెలుస్తోంది. ఇప్పటివరకూ తెలుగు సినీ చరిత్రలో ఇటువంటి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు చాలా అరుదు అనే చెప్పాలి. పోయిన సంవత్సరం ఇటువంటి కథతో కన్నడలో “కె . జి . ఎఫ్ ” తెరకెక్కి అన్ని భాషలలో ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. అలాగే ఈ చిత్రంకూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చి గొప్ప విజయం సాధించాలని కోరుకుందాం.