ఇప్పుడు ప్రపంచమంతా కరోనా మహమ్మారి భయంతో వణికిపోతోంది . ఇటువంటి కష్ట సమయంలో పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను కాపాడటంలో నిమగ్నమయ్యి ఉన్నారు . తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంతటి సేవ చేస్తున్న పోలీసులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసినదే . వారి కుటుంబాలను వదిలిపెట్టి అందరి కుటుంబాలను కాపాడుతున్న వారిపై దాడులు జరగడం అమానుషం . ఇప్పటికైనా పోలీసులను శత్రువులుగా భావించకుండా వారిని మిత్రులుగా భావించి ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి
ఇప్పుడు ఇదే విషయం పై సైబరాబాద్ పోలీసు వారు ఒక పాటను రూపొందించారు . ఈ పాటను ప్రముఖ పాటల రచయత చంద్రబోస్ గారు రాసి ఆయనే స్వయంగా ఈ పాటను పాడారు . కొద్దీ సేపటి క్రితం పోలీస్ కమిషనర్ ఆఫీస్ నందు ఈ పాటను విడుదల చేసి సీపీ సజ్జనార్ గారు చంద్రబోస్ గారిని సత్కరించారు . ఈ పాటను సైబరాబాద్ పోలీసు వారు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేశారు .



“ఆలోచించండి అన్నలారా” అంటూ సాగే ఈ పాట అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది . పోలీసులు అందరినీ తమ సొంతవారిగా భావించి సేవచేస్తుంటే ప్రజలు వారిని ఏ విధంగా చూస్తున్నారనే విషయాన్ని చంద్రబోస్ చక్కగా తెలియజేశారు . ఇటువంటి పాటలు ద్వారా అయినా జనాలలో మార్పు వచ్చి పోలీసులకు సహకరించి ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టే యజ్ఞంలో సమిధలవ్వాలని కోరుకుందాం .