ఎటువంటి పరిస్థితులలోనైనా అందరినీ తన సొంతవారిగా భావించి వారికి ఏ సమస్య వచ్చినా తక్షణం స్పందించి ఆదుకునే వాడే అసలైన ప్రజా నాయకుడు . ఇటువంటి ప్రజానాయకులు ఇప్పుడు ఉన్న రాజకీయాలలో చాలా అరుదు . ఇటువంటి అరుదైన ప్రజానాయకులలో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఒకరు . కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో ఆయన సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ సహాయం అంటూ తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికీ వెంటనే సహాయం చేస్తూ ప్రజా నాయకుడు అంటే ఇలానే ఉండాలనేకాక చాలా మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు

టీఆర్ఎస్ యువ నాయకుడు ఉదయ్ శర్మ కూడా ఒక సమస్యను సామాజిక మాధ్యమైన ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు . ఒక మహిళ ఇటీవల రెయిన్బో హాస్పిటల్స్ , బంజారా హాల్స్ లో కవలలు జన్మనివ్వగా , ఒక బిడ్డ చనిపోయి , మరొక బిడ్డ ప్రాణాలతో పోరాడుతోందని , మధ్య తరగతి కుటుంబం అవ్వడం వలన వైద్యానికి అవసరమైన ఖర్చు భరించడం చాలా కష్టంగా ఉందని , సహాయం అందించవలసినదిగా ఉదయ్ శర్మ అభ్యర్ధించారు . ఈ అభ్యర్థనకు కేటీఆర్ సహృదయంతో స్పందించి వెంటనే ఆ మహిళ వివరాలు తెలుసుకొని కొన్ని గంటలలోనే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఒక లక్ష రూపాయలు ఆమె వైద్యానికి కేటాయిస్తున్నట్టు తెలిపారు . ఇలా ఒక్కరు కాదు , ఇద్దరు కాదు ఎంతో మంది అభ్యర్థనలకు స్పందించి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు కేటీఆర్ . ప్రపంచంలోనే గొప్ప ప్రజానాయకుల జాబితాలో ఉండే అతి కొద్ది మంది నాయకులలో కేటీఆర్ నిలుస్తారనే విషయంలో అతిశయోక్తి లేదు .

ఇంత గొప్ప స్థాయిలో ఉండి ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కేటీఆర్ స్పందిస్తున్న తీరుతో స్ఫూర్తి పొంది అనేక మంది ఎమ్మెల్యేలు , క్రింది స్థాయి నాయకులు ప్రజలకు సహకరిస్తూ వారి బాగోగులు చూస్తున్నారు . ఇలా తాను చేయడమే కాక , ఎంతోమందిలో స్ఫూర్తిని నింపి ప్రజల పట్ల తనకున్న బాధ్యతను అద్భుతంగా నిర్వహిస్తున్నారు కేటీఆర్ .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments