తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర లాక్‌డౌన్ డేట్ మే 3వ తేదీతో సంబంధం లేకుండా తెలంగాణలో 7వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అదిరిపోయే ఆఫర్లు ఇచ్చారు. ఇక తెలంగాణ ప్రజలకు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ప్రతి మనిషికి నెలకు 12 కేజీలు రేషన్ ఇస్తామని చెప్పిన కేసీఆర్… ఏప్రిల్ 7వ తేదీ లోపే రు. 1500 అక్కౌంట్లో జమ చేస్తామన్నారు.

ఇక తెలంగాణలో ఉన్న వలస కూలీలకు సైతం ఇలాగే రేషన్‌, నగదు ఇస్తామన్నారు. ప్రతి వలస కూలీకి రు. 12 కేజీల బియ్యం.. రు.1500 క్యాష్ ఇస్తామని… వలస కూలీ ఇంట్లో ఎంతమంది ఉంటే అందమందికి 12 కేజీల బియ్యం ఇస్తామని ప్రకటించి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న లక్షలాది మంది వలస కూలీల పాలిట దేవుడు అయ్యారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments