కరోనా లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో వధూవరులు మాస్క్‌లు, గ్లోవ్స్ ధరించి, కేవలం ఆరుగురు కుటుంబసభ్యుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్న ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో వెలుగుచూసింది. సూరత్ నగరానికి చెందిన పూజ, దిశాంక్‌ల వివాహం గురువారం వధువు ఇంట్లో జరిగింది. పెళ్లంటే భాజాభజంత్రీలు, విందువినోదాలతో ఆడంబరంగా సాగే తంతు కాగా, కరోనా లాక్ డౌన్ పుణ్యమా అంటూ కేవలం ఆరుగురు కుటుంబసభ్యుల సమక్షంలోనే పెళ్లి జరిపించారు. మా ఇంటి టెర్రస్ పై కేవలం వధూవరుల తల్లిదండ్రుల సమక్షంలో మాస్క్‌లు, గ్లోవ్స్ ధరించి పెళ్లి తంతు ముగించేశాం అని వధువు పూజా చెప్పారు. వివాహ జరిగిన స్థలాన్ని కూడా శానిటైజ్ చేశామని, ఈ వివాహాన్ని బంధుమిత్రులకు వీడియోకాల్స్ లో చూపించామని వరుడు దిశాంక్ చెప్పారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments