ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణకిస్తున్న నేపథ్యంలో అందరి నోటా ఒకటే మాట. ‘స్టే హోం.. స్టే సేఫ్‌’. కరోనా కట్టడికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ కాలాన్ని మే 3వ తేదీ వరకూ పొడిగించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తమవంతు సాయం చేస్తున్నారు. ముఖ్యంగా సినీతారలు కరోనాపై జరిగే పోరాటంలో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. తమదైన శైలిలో స్పందిస్తూ ప్రజలు క్షేమంగా, భద్రంగా ఉండాలని కోరుతున్నారు. ఇటీవల అన్ని చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అగ్ర నటులు ‘ఫ్యామిలీ’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించిన సంగతి తెలిసిందే. అలాగే బుల్లితెర నటులందరూ కలిసి ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశారు.

తాజాగా తెలుగు బుల్లితెర, వెండితెర నటులు, గాయనీ గాయకులతో కూడిన ఓ వీడియోను జ్ఞాపిక ప్రొడక్షన్స్‌ అభిమానులతో పంచుకుంది. సెలబ్రిటీలందరూ ముక్తకంఠంతో ‘స్టే హోం.. స్టే సేఫ్‌’ నినాదాన్ని ఇచ్చారు. బయటకు వెళ్లినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆది, శ్రీనివాసరెడ్డి, ప్రగ్యా జైశ్వాల్‌, ఈషారెబ్బ, అవంతిక మిశ్రా, రఘు, రజిత, ప్రవీణ, హరితేజ, శ్రీముఖి, శ్యామల, శివజ్యోతి, హిమజ, అశురెడ్డి, అశ్విని, చలాకీ చంటి, రవికృష్ణ, స్వీటి, గాయనీ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, రమ్య బెహరా, శ్రీకృష్ణ, కృష్ణచైతన్య, ధనుంజయ్‌, మోహన భోగరాజు, మంగ్లీ, నోయల్‌, మాళవిక, , గీతా మాధురి, సునీతతో పాటు, రవి శంకర్‌, సాయికుమార్‌, మంచులక్ష్మి, నిధి అగర్వాల్‌, వితిక షేరు, యాంకర్‌ రవిలు తమ సందేశాన్ని వినిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments