సామాజిక, సాహితీ సేవల్లో నేటి తరానికీ స్ఫూర్తిగా నిలిచే మహనీయుడు స్వర్గీయ కందుకూరి వీరేశలింగం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. నేడు కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా పవన్ ఆయనను స్మరించుకున్నారు. ”మాతృ భాష మాధుర్యాన్ని తదుపరి తరాలకు అందించేందుకు కందుకూరి వీరేశలింగం ఎంతో కృషి చేశారు. వాడుక భాషలోనే రచనలు చేయడం అందులో ముఖ్యమైనది. తెలుగులో తొలి నవల, తొలి ప్రహసనం, తొలి స్వీయ చరిత్రలను రచించిన ఘనత వీరేశలింగం గారిదే.

కందుకూరి వీరేశలింగం గారు సమాజ హితం కోరుతూ హితకారిణి సమాజం స్థాపించారు. తెలుగు భాష కోసం చేసిన సేవలను మరువకూడదు. ఇప్పుడు మన మాతృ భాషను విద్యా సంస్థల నుంచి దూరం చేసే ప్రయత్నాలను పాలకులు మొదలుపెట్టారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మాతృ భాషకు ఊపిరులూదేలా తీర్పు ఇచ్చి భాషాభిమానులకు ఊరటనిచ్చింది. ఈ తరుణంలో మనందరం వీరేశలింగం గారు ఇచ్చిన స్ఫూర్తిని అందిపుచ్చుకొని భాషకు అన్యాయం చేసేవారిని అడ్డుకొందాం. ఆ నవయుగ వైతాళికుడు నడయాడిన గోదావరి తీరంలోనే ‘మన నుడి – మన నది’కి శ్రీకారం చుట్టాం. ఆ సంస్కర్త అందించిన స్ఫూర్తితోనే మన నుడి మన నదిని ముందుకు తీసుకువెళ్తాం” అని పవన్ పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments